ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ రోమింగ్ ఛార్జీలను తగ్గించింది. కొత్తగా ప్రవేశపెట్టిన పథకం ఎయిర్‌టెల్ టర్బో కింద రోమింగ్ ఛార్జీలను దాదాపు 60శాతం తగ్గించింది. రోమింగ్‌లో ఉండి సొంత సర్కిల్‌లోని ఫోన్లకు, దూర ప్రాంతానికి చేసే కాల్స్‌కు మాత్రం నిమిషానికి 80 పైసలు వసూలు చేస్తారని, రోమింగ్‌లో ఉన్నప్పుడు వచ్చే అన్ని ఇన్‌కమింగ్ కాల్స్‌కు నిమిషానికి 60 పైసలు రోమింగ్ చార్జీలు వసూలు చేస్తారని ఎయిర్‌టెల్ ఓ ప్రకటనలో తెలిపింది.